
వెల్దుర్తి, వెలుగు: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూర్ గ్రామ శివారులోని సాయి సంతోష్ రేణుక ప్లాస్టిక్ ఇండస్ట్రీ దగ్ధమైంది. ఆదివారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకుని అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్‌తో వచ్చి మంటలను ఆర్పారు. కానీ అప్పటికే పరిశ్రమ పూర్తిగా దగ్ధమైంది. అందులో ఉన్న ముడి సరుకులు, విలువైన సామగ్రితో పాటు మిషన్లు పూర్తిగా కాలిపోయాయి. సుమారు మూడు కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు.